Where is intolerance ?

1 January 2016

ఎవరికి ఎవరిపై 'అసహనం'?

ఈ మధ్యకాలం లో మనం అతి తరచుగా మీడియాలోనూ, వార్తలలోనూ, అందరి నోటివెంటా వింటూ ఉన్నమాట 'అసహనం'. చివరికి మన చట్టసభలలో కూడా ఈ 'అసహనం' మీద విపరీతం గా వాదులాడుకోవటం, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టటం అనేది చూస్తూనే ఉన్నాం.

మనం జాగ్రత్తగా దీనిని పరిశీలిస్తే, నిజానికి భారత దేశం లో అసహనం పెరుగుతోంది అనే ప్రచారం కేవలం అత్యధిక శాతం ప్రజలను, వారి విశ్వాసాలను, సాంప్రదాయాలను, సాంస్కృతిక విలువలను, వేల సంవత్సరాలుగా భారతీయుల నరనరాలలో జీర్నిచుకుని ఉన్న సర్వమత సర్వమానవ సమభావనను అవమాన పరచటంగా మనకు అర్ధం అవుతుంది.

వేలాదిమంది రైతుల ఆత్మహత్యలు 'వీరికి ' 'అంతరాత్మ ప్రబోధాన్ని ' కలింగించలేదు!!!

తమకు లభించిన ప్రభుత్వ గౌరవాలు తిరిగి ఇచ్చివేసి నిరసన ప్రకటించేటట్లు వీరిని చేయలేదు!!!

వేలకువేలమంది కాశ్మీరీ పండితుల ఊచకోత, తమ మాతృ స్థానం నుండి వారి తరిమివేత ఈ 'మానవతావాదుల ' ధర్మాగ్రహానికి లేశము గురికాలేదు!!!

వందలాది హిందూ స్త్రీల మానభంగాలు, పాశవిక హత్యలు వీరిని, తామందుకున్న ప్రతిష్ఠాత్మక ప్రభుత్వ పురస్కారాలను విసర్జించి తద్వారా ఈ ఘోర అకృత్యాలను అరికట్టడంలో ప్రభుత్వ అలసత్వాన్ని ఖండించేందుకు పురిగొల్పలేదు!!!

 కానీ ఇటీవల జరిగిన, ప్రగతిశీలవాదులైన కలుబరిగె, నరేంద్ర ధబోల్కర్, గోవింద్ పన్సరే ల హత్యలు; దాద్రీ లో, ఆవు మాంసం వండుకుతిన్నడన్న ఆరోపణతో ఒక గుంపు చేతిలో ఒక ముస్లిం పౌరుడు హత్యకు గురైన ఒక దురదృష్టకర సంఘటన - ఇవి, నవలా రచయిత్రి నయన్ తార సెహగల్ (పండిట్ నెహృ మేనకోడలు), కవి అశోక్ వాజపేయి, నవలా రచయిత శశిదేష్ పాండే, మరొక కవి సచ్చిదానందన్, రచయిత్రి తార జోసెఫ్, సైంటిస్ట్ డాక్టర్, పుష్ప మిత్ర భార్గవ వంటివారు ' అంతఃకరణను కదిలించి ', నరేంద్ర మోడి ప్రభుత్వ హయాములో దేశం లో పెరుగుతున్న 'అసహనం' పట్ల తమ నిరసన అంటూ తాము పూర్వం పొందిన సాహిత్య అకాడమీ అవార్డులను, తదితర గౌరవాలను ఇచ్చివేయడం జరిగింది.

తనకు సాహిత్య అకాడమీ అవార్డు ఇచ్చిననాటి ప్రభుత్వ హయాములోనే వేల మంది సిక్కులు ఊచకోత కోయబడినప్పుడు ' వేలమంది కాశ్మీరీ పండితుల నరమేథం జరిగి, వేల సంవత్సరాలుగా నివసిస్తున్న తమ మాతృభూమి నుండి మిగిలినవారందరూ బలవంతం గా తరిమివేయబడినప్పుడు, ఒక కాశ్మీరీ పండిత కుటుంబానికి చెందిన మహిళ గా కూడా తనకు కలుగని అంతరాత్మ ప్రభోదం, నయన్ తారా సెహగల్ కు ఇటీవలే కలగటం, అలాగే అనేకమంది ఇతరులకు కూడా కలిగి, కూడబలుక్కున్నట్లుగా తమ పురస్కారాలను తిరిగి ఇచ్చివేయతం, ఏ కొంచం చరిత్ర జ్ఞానం, పరిశీలన కలిగిన సామాన్య పౌరుడికైనా అమితాశ్చర్యం కలిగించే విషయమే. నిత్యం పరమత అసహనమే తమ ఇంధనం గా, పరమత దూషణతోనే శతాబ్దాలుగా బహిరంగం గా భారతీయులను మతమార్పిడి చేస్తున్న విదేశీమతాల "అసహనం" ఈ మానవతా మూర్తులైన మేధావులెవ్వరికీ లేశమైన కనబదకపోవటం; ఇటీవలి కొన్ని అవాంఛనీయ సంఘటనలలోనే అతి ప్రమాదకరమైన 'అసహనం' విశ్వరూపమెత్తి కనబడి, తీవ్రంగా వీరిని కలతచెందేటట్లు చేయటం ఎవరికైనా విడ్డూరం కలిగించకమానదు, అంతేగాక మన దేశంలోనే ఛత్తీస్గఢ్ వంటి అరన్య ప్రాంతాలలో, నక్సలైట్ల చేతుల్లో అతి తరచుగా అనేకమంది మనవీర జవాన్ల బలొ కూడా వీరి అంతరాత్మను కదిలించి, ప్రభుత్వాన్ని ప్రశ్నించేటట్లు చేయకపోవటం కూడా స్ఫురించకమానదు.

అలాగే, ఈనాడు వీరందరూ చేస్తున్న 'వ్యూహాత్మకమైన మూకుమ్మడి బాహ్య నిరసనలలో, తీవ్రమైన ప్రభుత్వ ఖండనలలో ఒక నిగూఢమైన ప్రణాళిక గోచరించక మానదు.

మత అసహనం, ద్వేషాలను అవెక్కడ తలెత్తిన ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేయవలసినదే. దోషులను కఠినంగా శిక్షించవలసినదే. సర్వజన, సర్వమత, సర్వమానవ సమభావన అనేది వేల సంవత్సరాలుగా భారతీయుల నరనరాలలో జీర్ణించుకుని ఉన్నదే; మన భారత రాజ్యాంగంలోనూ అతిస్పష్టంగా నిర్దేశింపబదినదే. దానిని అమలు పరచటం యే ప్రభువానికైనా ప్రధాన కర్తవ్యమే. ఐతే ఇటీవలి ఆత్మ ప్రబోధాలకు, అవార్డులు తిరిగి ఇచివేయడాలకూ అసలు కారణం మాత్రం వేలమందికి చలా సులువుగా కనబడుతోంది.

ఈ దేశపు అత్యధిక శాతం ప్రజల అనాది విశ్వాసాలు, ప్రాచీన సంస్కృతి, విలువలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒకే ఒక కారణం చేత 'అభివృద్ధి నినాదంతో సర్వజనసమ్మతం గా ఎన్నికైన ఒక ప్రభుత్వాన్ని ద్వేషిస్తూ, దానిని ఏదోవిధంగా దిగలాగివేయడానికై దేశంలో ఎక్కడెక్కడో జరిగిన కొద్ది అవాంచనీయ ఘటనలకు పూర్తి బాధ్యతను ప్రభుత్వానికే అంటగట్టి  గోల చెయ్యదం గా ఈ హదావిడి గోచరిస్తుంది. ఈ వర్గాలవారు, దేశంలో పెరుగుతోందని చెబుతోన్న 'అసహనం' కోట్లాది ప్రజలలోని హిందూ భావనలపై, వాటిపై గౌరవభావం కలిగిన ప్రభుత్వం పై ఈ వర్గాల 'అసహనం' మాత్రం ఇటీవలి ఘటనలలో స్పష్టంగా తెలుస్తోంది.

 

Courtesy:  Editorial, సుపథ సాంస్కృతిక ద్వైమాసిక పత్రిక  Nov-Dec 2015

 

Most Viewed